జగిత్యాలను టాప్-3లో నిలపాలి
NEWS Oct 01,2026 07:38 pm
జగిత్యాల: FLN, విద్యా ప్రమాణాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తక్కువ పనితీరు పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, తదుపరి MFCలోనూ ఫలితాలు మెరుగుపడకపోతే చర్యలు ఉంటాయని తెలిపారు. నవంబర్ 1 నాటికి జగిత్యాలను అన్ని అంశాల్లో టాప్-3లో నిలపాలని సూచించారు. సమావేశంలో డీఈఓ కె. రాము, ఏఎంఓ ఎం. చంద్రశేఖర్ రెడ్డి, MEOలు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలు, అకడమిక్ ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు.