అక్టోబర్ 3న పీడీఎస్‌ఓ జిల్లా మహాసభ
NEWS Oct 01,2026 06:03 pm
చోడవరం: అక్టోబర్ 3న చోడవరంలోని నూకాంబిక కళ్యాణ మండపంలో పీడీఎస్‌ఓ అనకాపల్లి జిల్లా మహాసభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల, హాస్టల్ మెస్ బిల్లులు పెంపు, ఖాళీ పోస్టుల భర్తీ తదితర విద్యార్థుల సమస్యలపై మహాసభలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, మేధావులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.