సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన కర్నూలు జిల్లా YCP ఉపాధ్యక్షులు
NEWS Oct 01,2026 06:02 pm
తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. పార్టీ కార్యక్రమాలు, జిల్లా స్థాయి రాజకీయ పరిస్థితులపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.