సైన్స్ సెమినార్‌లో ఈశ్వర వరప్రసాద్‌కు 3వ స్థానం
NEWS Sep 29,2026 11:04 pm
మల్లాపూర్: హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌లో మల్లాపూర్ తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థి ఈశ్వర వరప్రసాద్ మూడో స్థానంలో నిలిచారు. రాఘవపేటకు చెందిన విద్యార్థికి ఉపాధ్యాయుడు వెంకటేష్ మెంటర్‌గా వ్యవహరించారు. విద్యార్థి ప్రతిభను ప్రిన్సిపల్ భూమేష్ అభినందించి, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.