అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా వచ్చిన 45 ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ప్రతి ఫిర్యాదుపై వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి, బాధితులకు చర్యల వివరాలు తెలియజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.