పంటలను పరిశీలించిన వ్యవసాయాధికారి
NEWS Sep 28,2026 07:45 pm
బుచ్చయ్యపేట మండలంలోని ఎల్.సింగవరం, బంగారుమెట్ట, దిబ్బిడి, కందిపూడి గ్రామాల్లో మండల వ్యవసాయాధికారి మల్ల నారాయణరావు వరి పంటలను పరిశీలించారు. వాతావరణ మార్పులతో ఆకుముడత, దోమ ఉధృతి పెరిగినట్లు గుర్తించారు. ఆకుముడత నివారణకు ముల్లకంపను పొలంలో తిప్పాలని, దోమ నివారణకు పైమెట్రోజిన్ 50% WG మందును సూచించిన మోతాదులో పిచికారీ చేయాలని రైతులకు సూచించారు.