గణేషుడి పూజలో పాల్గొన్న బాల్‌రాజ్ గౌడ్
NEWS Sep 23,2026 01:09 pm
వినాయక నవరాత్రుల ముగింపు సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన గణపతి పూజ మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ చైర్మన్ పల్లె బాల్‌రాజ్ గౌడ్ పాల్గొన్నారు. అనంతరం మండపం వద్ద నిర్వహించిన అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆల్ రిసా గ్రూప్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.