వరంగల్ (మామునూరు) ఎయిర్‌పోర్టుకు
దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని డిమాండ్
NEWS Sep 22,2026 07:23 am
వరంగల్ మామునూరు విమానాశ్రయానికి తెలం గాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేరు పెట్టాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిజాం నిరంకు శత్వం, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి అమరుడైన కొమురయ్య త్యాగాన్ని గౌరవించాలని గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం సహా పలు సంఘాల నేతలు కోరుతున్నా రు. ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూసేకరణ పూర్తయిన నేపథ్యంలో పేరు సూచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరినందున ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది.