మైనర్లకు వాహనాలు ఇవ్వద్దు
NEWS Sep 22,2026 11:36 am
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ హెచ్చరించారు. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సుమారు 150 మందికి ఏసిపి కౌన్సిలింగ్ నిర్వహించారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. ఎవరైనా మద్యం సేవించి రెండోసారి పట్టుపడితే కట్టిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు.