భారత్‌కు 4 యూరప్ దేశాల మద్దతు
NEWS Sep 22,2026 11:49 am
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి మద్దతు లభించింది. న్యూయార్క్‌లో 81వ ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా వీ4-భారత్ విదేశాంగ మంత్రుల సమావేశంలో హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ భారత్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపాయి. స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ మాట్లాడుతూ.. ప్రపంచ దక్షిణ దేశాల్లో కీలకమైన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని వీ4 దేశాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని తెలిపారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా తదితర దేశాలు మద్దతు ప్రకటించాయి.