బస్సు ప్రమాదాన్ని న్యూస్ కవరేజీ చేస్తుండగా..
కూలిన హెలికాప్టర్ - ముగ్గురు మృతి
NEWS Sep 16,2026 04:21 pm
USA: బస్సు ప్రమాదాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ నుంచి బస్సు ప్రమాదాన్ని లైవ్ కవరేజీ చేస్తుండగా.. అది ఒక్కసారిగా కూలిపోయింది. లాస్ ఏంజెలెస్‌లో జరిగిన ఈ ఘటనలో శాన్ ఫెర్నాండో వ్యాలీ గగనతలంలో NBC న్యూస్ నెట్‌వర్క్ మీడియా ప్రతినిధుల హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి పార్కింగ్ ప్రాంతంలో కుప్పకూలింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.