మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
NEWS Sep 15,2026 05:54 pm
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(ఆళ్ల నాని) కన్నుమూశారు. 57 ఏళ్ల నాని విశాఖలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 1969 డిసెంబర్ 30న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆళ్ల నాని జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఓడిన ఆళ్ల నాని.. 2024 ఆగస్టు 17న ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2025 ఫిబ్రవరి 13న తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆళ్ల నాని మృతితో ఏలూరు జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.