రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలి
NEWS Sep 13,2026 10:03 pm
హనుమకొండ: నగరంలోని 49వ డివిజన్ నాగేంద్రనగర్, ఇందిరమ్మ కాలనీతో పాటు పలు ప్రాంతాలను సీపీఎం మండల కార్యదర్శి మంద సంపత్ పరిశీలించారు. కాలనీవాసులు రోడ్లు, డ్రైనేజీ సదుపాయాలు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు కురిసినప్పుడు కాలనీలు నీటమునిగి ప్రజలు అవస్థలు పడుతున్నారని సంపత్ తెలిపారు. కాలనీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని పేర్కొన్నారు.