యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
NEWS Sep 12,2026 09:01 pm
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు, భీకర పోరాటం కొనసాగుతోంది. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. ఈ ప్రాంతంలో పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ ట్రంప్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. హౌతీ తిరుగుబాటుదారులు అమెరికాతో పోరాడటానికి సిద్ధంగా లేరని, అయితే సౌదీ పైప్‌లైన్‌పై జరిగిన డ్రోన్ దాడికి ఇరానే కారణం కావచ్చని ఆయన పేర్కొన్నారు. నవంబర్ 3న జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఈ యుద్ధం వెంటనే ముగుస్తుందని గతంలో ట్రంప్ తెలిపారు.