డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మహిళల భాగస్వామ్యం కీలకం
NEWS Sep 12,2026 09:14 pm
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి మహిళల భాగస్వామ్యం కీలకమని వరంగల్ సీపీ శ్వేతా అన్నారు. హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో సమాజ భద్రత కోసం డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన సంఘమిత్ర అవగాహన కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామీణ మహిళలు, యువత కుటుంబాలకు అవగాహన కల్పించారు.ఎక్కడైనా మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం లేదా అక్రమ రవాణా గురించి సమాచారం తెలిసినప్పుడు పోలీసులకు బాధ్యతగా తెలియజేయాలన్నారు.