విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
NEWS Sep 12,2026 11:01 pm
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్
తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు కేంద్రంగా సెప్టెంబర్ 12 నుంచి 18 వరకు సిఏటిసి-6 ఎన్సిసి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.కేఎస్ బింద్ర ఆధ్వర్యంలో శిబిరం ప్రారంభమైంది.శిబిరంలో భాగంగా క్రమశిక్షణ,నాయకత్వం,దేశభక్తి, జాతీయ సమైక్యతతో పాటు విపత్తుల నిర్వహణ,ప్రమాదాల నిర్వహణ పలు విధానాలపై క్యాడేట్లకు శిక్షణ అందించనున్నట్లు బింద్రా తెలిపారు.