శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సన్మానం
NEWS Sep 12,2026 03:36 pm
పాల్వంచ పట్టణంలోని శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ నల్ల సురేష్ రెడ్డి నివాసానికి శనివారం శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి విచ్చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం న్యాయమూర్తిని శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.