అభివృద్ధి పనులు పారదర్శకంగా నిర్వహించాలి: ఈఈ మధుకర్
NEWS Sep 12,2026 10:55 pm
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన ఇంజనీరింగ్ శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ సమీక్షించారు. రోడ్లు, వంతెనలు, తరగతి గదులు, నివాస భవనాలు, వసతి గృహాల మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ ఐఏఎస్ ఆదేశాల మేరకు పెండింగ్ లేకుండా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని తెలిపారు.