మార్కెట్ యార్డు అభివృద్ధికి నిధులు
NEWS Sep 12,2026 05:29 pm
కథలాపూర్ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ అభివృద్ధికి రూ.2.96 కోట్ల నిధులు మంజూరయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కృషితో నిధులు విడుదలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్కెట్ యార్డులో గోదాం నిర్మాణానికి రూ.2.26 కోట్లు, డ్రెయిన్ నిర్మాణానికి రూ.55 లక్షలు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.14.50 లక్షలు కేటాయించారు. అభివృద్ధి పనులతో మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో నిధులు మంజూరు కావడంపై స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.