సీఐ వీరయ్యకు ఘన సన్మానం
NEWS Sep 10,2026 11:49 pm
సదాశివనగర్: సదాశివనగర్ సీఐగా బాధ్యతలు చేపట్టిన వీరయ్యను మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సాయగౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సాయగౌడ్ మాట్లాడుతూ పోలీసులు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తారని అన్నారు. సదాశివనగర్ సీఐగా బాధ్యతలు చేపట్టిన వీరయ్య మండల ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించారు. సోషల్ మీడియా ఇన్‌చార్జి మోసర్ల శ్రీకాంత్‌రెడ్డి, కుప్రియల్ గ్రామ అధ్యక్షుడు లింగం, సాయిలు, తుక్కోజీవాడి రాజు, వేణు, మధు తదితరులు పాల్గొన్నారు.