వినాయక చవితి నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్ లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రాజేందర్ రెడ్డి కలెక్టర్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. తక్కువ వర్షపాతం కారణంగా ఈసారి నగరంలోని చెరువులు నీటి వనరులో నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాంతోపాటు తక్కువ ఎత్తు అలాగే మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని ప్రజలకు సూచించారు.