ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా మధుయాష్కీ
NEWS Sep 10,2026 07:33 am
మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు లభించాయి. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపీసీ) నూతన ఛైర్మన్‌గా ఆయనను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారు. ఇప్పటివరకు ఛైర్మన్‌గా పనిచేసిన ప్రవీణ్ చక్రవర్తి సేవలను పార్టీ ఈ సందర్భంగా ప్రశంసించింది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా కీలక పాత్ర పోషించినప్పటికీ, ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ, కాంగ్రెస్ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న యాష్కీకి జాతీయ స్థాయిలో పదవి లభించింది.