ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాలతో రూ.10 వేల ఆర్థిక సహాయం
NEWS Sep 10,2026 07:33 am
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చాకలి మునెప్ప నిన్న మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పెద్దలు రామాంజనేయులు, రామచంద్ర, పెద్దయ్య, చాకలి మళ్లీ తదితరులు కలిసి మునెప్ప కుటుంబానికి 19 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా ఇచ్చారు.