ఫాంహౌస్ కు వెళ్తున్న కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్
NEWS Sep 08,2026 03:34 pm
ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ కీలక నాయకత్వాన్ని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకుని అరెస్టు చేశారు. అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి పయనమైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేల వాహనాల కాన్వాయ్‌ను మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు బారికేడ్లు పెట్టి నిలిపివేశారు. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.