రిమాండ్ ఖైదీకి మెరుగైన వసతులు, ములాఖత్‌లు కల్పిస్తూ.. ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసేందుకు ₹10,000 లంచం డిమాండ్ చేసిన హుజూరాబాద్ సబ్‌జైలర్ నాంపల్లి దేవేందర్, పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీష్‌లను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో బంక్‌లో లంచం తీసుకుంటుండగా దాడి చేసి, ఇద్దరినీ కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు.