స్నాతకోత్సవానికి అంగీకరించిన గవర్నర్
NEWS Sep 07,2026 11:35 pm
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ ఉపసంచాలకులు ప్రతాపరెడ్డి హైదరాబాద్ లోని లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిపాలన, విద్యా విధానం పలు అంశాలపై చర్చించారు. యూనివర్సిటీలో నిర్వహించే 24వ స్నాతకోత్సవ వేడుకపై చర్చించారు. ఇందుకు గవర్నర్ అంగీకరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రామచంద్రం, పరీక్షల నియంత్రణ అధికారి తదితరులు పాల్గొన్నారు.