పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం చేయవద్దు
NEWS Sep 07,2026 11:32 pm
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వరంగల్ లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులతో కలిసి కవిత ధర్నా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జీవోతో పాలిటెక్నిక్ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించేందుకు వెళుతున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.