ప్రశ్నించే గొంతులను నొక్కడం సరికాదు
NEWS Sep 07,2026 11:32 pm
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు లేదా అని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నెపునేని నరేందర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎదుట జరిగిన తీరును నిరసిస్తూ వరంగల్ లో బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నరేందర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణగదొక్కడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ నేతలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన తమ పోరాటం ఆగదన్నారు.