జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
NEWS Sep 07,2026 11:34 pm
రాయికల్: అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, ఇండ్లు మంజూరు చేసి జర్నలిస్ట్ కాలనీ ఏర్పాటు చేయాలని రాయికల్ మండల ప్రెస్ క్లబ్ నాయకులు కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని అనువైన స్థలంతో పాటు నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ కాంప్లెక్స్ స్థలాన్ని జర్నలిస్టులకు కేటాయించాలని కోరారు. సగం నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా పూర్తి చేసి సీనియారిటీ ఆధారంగా జర్నలిస్టులకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చింతకుంట సాయికుమార్, ప్రధాన కార్యదర్శి సింగిడి శంకరయ్య పాల్గొన్నారు.