కరీంనగర్: స్థానిక పద్మనాయక కళ్యాణ మండపంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు రెండో రోజు ఉత్సాహంగా సాగాయి. జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ ఎర్రజెండాను ఆవిష్కరించగా.. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం 33 జిల్లాల ప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.