కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్!
NEWS Sep 07,2026 09:51 am
AP: పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత కార్మికులు, డప్పు కళాకారులు, చర్మకారులు, ట్రాన్స్‌జెండర్ వర్గాల్లో అర్హులైన కొత్త వారికి ఈ పింఛన్లు అందనున్నాయి. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది. ఈ నెల 16లోగా స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ప్రక్రియను ఈ నెల 26నాటికి పూర్తి చేస్తారు.