తెలంగాణలో 20 జిల్లాలకు అలర్ట్ జారీ
NEWS Sep 07,2026 09:43 am
తెలంగాణలో 2 రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేస్తూ.. 6 జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’, మరో 14 జిల్లాలకు ‘యెల్లో అలర్ట్’ జారీ చేసింది. మేడ్చల్, నల్లగొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారుల అంచనా. హైదరాబాద్‌లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.