సృష్టి ఉన్నంతవరకు ఎర్రజెండా: కూనంనేని
NEWS Sep 06,2026 10:49 pm
రాజకీయ పొత్తులతో సంబంధం లేకుండా ప్రజా సమస్యలపై పోరాటాలు సాగుతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐకి శతాబ్ద కాల చరిత్ర ఉందన్నారు. సృష్టి ఉన్నంతకాలం ఎర్రజెండా నిలిచే ఉంటుందని, హక్కుల సాధనకు కమ్యూనిస్టులంతా ఒకే వేదికపైకి రావాలని ఆదివారం పిలుపునిచ్చారు.