కేటీఆర్‌కు విమర్శించే నైతిక హక్కు లేదు: మేయర్ కొలగాని
NEWS Sep 05,2026 07:06 pm
కరీంనగర్‌లో కేటీఆర్ నిర్వహించిన ‘యువ సమర భేరీ’ అట్టర్ ఫ్లాప్ అయిందని మేయర్ కొలగాని శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... బండి సంజయ్‌ను విమర్శించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో నిరుద్యోగ భృతి, పేపర్ లీకేజీలు, 317 జీవోలతో యువతను మోసం చేశారని, బండి సంజయ్ నిధులతో కరీంనగర్‌ను అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.