కరీంనగర్: మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. "నేను డాక్టర్‌ని.. స్కూటర్ లేని నీకు ఫామ్‌హౌస్‌లు ఎలా వచ్చాయి? నిన్ను తన్ని తరిమితే బొక్కలు కూడా మిగలవు" అని హెచ్చరించారు. ఈ క్రమంలో రసమయిని 'బోడి టీచర్' అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.