ఉత్తమ ఉపాధ్యాయులు - జిల్లా ఘనత
NEWS Sep 05,2026 08:15 am
జగిత్యాల: ఈ ఏడాది జిల్లాకు చెందిన 80 మంది ఉత్తమ జిల్లా ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారని DEO కే. రాము Breaking Now ప్రతినిధితో తెలిపారు. గతేడాది కంటే 20 మంది అధికంగా ఎంపికయ్యారన్నారు. విద్యా కార్యక్రమాల్లో జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో, టెన్త్ ఫలితాల్లో 4వ స్థానంలో ఉందన్నారు. బడిబాటలో 6 వేల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరారన్నారు. 5గురు టీచర్స్ సింగపూర్ టూర్‌కు, గుండు విజయ్, చంద్రశేఖర్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం హర్షణీయమన్నారు. APAAR ID నమోదులో జిల్లా తొలి స్థానంలో కొనసాగుతోందన్నారు.