ప్రమాదంలో 8 మంది విద్యార్థులు మృతి
NEWS Sep 05,2026 10:32 am
కేరళంలోని త్రిశూర్ జిల్లాలో హైవేపై ఆగిఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. ఈ కారు గురువాయుర్ నుంచి కొడుంగళూరు వెళ్తుండగా హైవేపై లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు పూర్తిగా నుజ్జునజ్జయ్యింది. మృతులంతా తమిళనాడులోని దిండిగుల్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులని పోలీసులు నిర్థారించారు.