తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం
NEWS Sep 04,2026 11:18 pm
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన కొండా సురేఖ భవిష్యత్ రాజకీయ ప్రయాణంపై చర్చ జోరందుకుంది. ఆమె BRSలోకి తిరిగి వస్తారన్న ప్రచారాన్ని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఖండించారు. సురేఖను BRSలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ చేర్చుకునేది లేదని, తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు BRSలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు.