తమిళనాడులోని కోయంబత్తూర్ తుడియాలూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిద్రిస్తున్న మతిస్థిమితం లేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ప్రతిఘటిస్తూ గట్టిగా అరవడంతో సమీపంలోని వీధి కుక్క అప్రమత్తమై నిందితుడిపై దాడి చేసింది. దీంతో భయపడిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.