ఒక్కసారి భగ్గుమన్న బంగారం ధర
NEWS Sep 03,2026 11:56 am
భారత్‌లో బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 3 రోజులుగా వరుసగా పతనమైన ధరలు నేడు ఒక్కసారిగా రూ.3 వేల పైచిలుకు మేర పెరిగాయి. డాలర్ బలహీనపడటం, యూఎస్ బాండ్స్‌పై రాబడులు తగ్గడంతో బంగారానికి మళ్లీ డిమాండ్ పుంజుకుంది. నేటి ఉదయం 11.55 సమయంలో హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,350కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ.3,333 మేర ఎగబాకింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.3,020 మేర పెరిగి రూ.1,42,400కు చేరుకుంది.