సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
NEWS Sep 02,2026 05:08 pm
కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలిసిన మంత్రి కొండా సురేఖ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పార్టీ పెద్దలను డిమాండ్ చేశారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేస్తూ చర్యలు తీసుకోవాలనుకోవడం సరికాదని సురేఖ స్పష్టం చేశారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. తన కుమార్తెను తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం... రెడ్డి సామాజిక వర్గాలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎంతోమంది అనుచిత వ్యాఖ్యలు చేసినా చర్యలు తీసుకోలేదని, కేవలం బీసీలనే టార్గెట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు.