విద్యార్థి సమస్యలపై పోరాటాలు సాగిద్దాం
NEWS Sep 01,2026 10:34 pm
కరీంనగర్ : విద్యార్థి సమస్యలపై ప్రశ్నిస్తూ పోరాటాలతోనే విజయాలు సాధిద్దామని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి ఐషి గోష్ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆమె మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను వీడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు రజనీకాంత్, నాగరాజు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అరవింద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.