కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై చాడ ఆగ్రహం
NEWS Sep 01,2026 10:34 pm
కరీంనగర్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.22 వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తూ, పేదలు, రైతులను విస్మరిస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కేంద్రమంత్రులు చొరవ చూపాలని కోరారు. ధరణి లొసుగులు, అధికారుల అవినీతిపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షించి, పాలనా ప్రక్షాళన చేపట్టాలని డిమాండ్ చేశారు.