విద్యార్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి
NEWS Sep 01,2026 10:35 pm
కరీంనగర్: శాతవాహన యూనివర్సిటీలో హాస్టల్, మేస్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన చేపట్టారు. మేస్ బిల్లుల పేరిట అధికారులు అదనపు ఆర్థిక భారం మోపుతున్నారని, ప్రశ్నిస్తే వంట సామాగ్రి తెచ్చుకోవాలనడం సరికాదని మండిపడ్డారు. రూ.కోట్ల నిధులతో గ్రౌండ్, గ్యాలరీలు కాకుండా.. 24/7 లైబ్రరీ, నాణ్యమైన భోజనం వంటి మౌలిక వసతులపై శ్రద్ధ చూపాలని, సమస్యలు తీరే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.