SDRF సిబ్బందికి రాఖీలు కట్టిన డా.రఘురామ్
NEWS Aug 28,2026 10:39 am
శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్ సందర్భంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ రఘురామ్, వారి వైద్య బృందం శుక్రవారం SDRF (రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం) సిబ్బందితో వేడుకలు నిర్వహించారు. నిరంతరం ప్రజారక్షణలో నిలిచే SDRF సభ్యులకు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు, బహుమతులు అందజేశారు. ఆపత్కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించే విపత్తు నిర్వహణ దళాల త్యాగం అభినందనీయమని డాక్టర్ రఘురామ్ కొనియాడారు.