నేపాల్‌లో విపత్తులో మరణించిన వారి సంఖ్య 469కి చేరుకుంది. మరో 1600 మందికిపైగా గల్లంతయ్యారు. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా 558 మంది గల్లంతయ్యారు. నేపాల్‌లో 288 మంది భారతీయుల జాడ తెలియడం లేదు. ఇందులో తెలుగువారూ ఉన్నారు. మరో 200 మంది టిబెట్ భూభాగంలో చిక్కుకుపోయారు. నేపాల్‌కు సహాయంగా అమెరికా 500,000 డాలర్ల సహాయాన్ని ప్రకటించగా, WHO అత్యవసర వైద్య సామగ్రిని పంపిస్తోంది.