నారాయణపేట జిల్లా మక్తల్‌లో స్థానిక వెంకటరమణ థియేటర్ వద్ద బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంతో ఆసక్తిగా తిలకించాలనుకున్న రవితేజ ‘ఇరుముడి’ చిత్రాన్ని అకస్మాత్తుగా నిలిపివేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రేక్షకులు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను తక్షణమే పునరుద్ధరించి, ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ థియేటర్ గేటు ఎదురుగా బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు.