బీజేపీ, బీఆర్‌ఎస్‌ల తీరుపై నరేందర్ రెడ్డి ధ్వజం
NEWS Aug 30,2026 11:15 pm
రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డుతోందని, విద్యార్థులపై మొసలి కన్నీరు కారుస్తోందని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల్లో కోతలు విధిస్తూ రాష్ట్రంపై అదనపు భారం మోపుతోందని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చని బీఆర్‌ఎస్ నాయకులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ పేరుతో బయలుదేరడం హాస్యాస్పదమని దుయ్యబట్టారు.