‘దృశ్యం 21’ తీస్తే.. జార్జ్‌కుట్టి ఫ్యామిలీ ఇలా..
NEWS Aug 25,2026 03:53 pm
‘దృశ్యం’ సిరీస్ సూపర్ హిట్. మొదటి 2 భాగాలు థ్రిల్ పంచగా, ‘దృశ్యం3’ ఫర్వాలేదనిపించింది. అన్నీ కుదిరితే.. దృశ్యం-4, దృశ్యం-5 కూడా వస్తాయని చిత్ర బృందం ప్రకటించింది. తాజాగా నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ ‘దృశ్యం-4’ను ప్రకటించారు. ‘దృశ్యం’ ప్రపంచం మరింత విస్తరిస్తుందని, కచ్చితంగా 4వ భాగం ఉంటుందని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. ఇంకెన్ని భాగాలు తీస్తారంటూ పలువురు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. తనని ఇంకా వదిలి పెట్టాలని వరుణ్ వేడుకొంటునట్లు క్రియేట్ చేసిన మీమ్స్ నవ్వులు పంచుతున్నాయి.