జిపి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం
NEWS Aug 25,2026 03:54 pm
కరీంనగర్: గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించారు. ఎన్నికల హామీ మేరకు వారిని పర్మినెంట్ చేయాలని, 2వ పిఆర్‌సి ప్రకారం కనీస వేతనం ₹26,000 చెల్లించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.